మన్యం న్యూస్, మణుగూరు , మార్చి28: ఏప్రిల్ 3, 4 తేదీలలో జరిగే ఆత్మీయ సమ్మేళ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహ రావు కోరారు. ఆయన మంగళవారం స్థానిక బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో
మణుగూరు టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. ఇందుకు కావలసిన కార్యాచరణను సంబంధిత నాయకులు రూపొందించుకోవాలన్నారు. ఆత్మీయ సమ్మేళ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువజన నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, అసంఘటిత కార్మిక సంఘ అధ్యక్షులు కత్తి రాము, బిఆర్ఎస్ పార్టీ మణుగూరు టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,సీనియర్ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్, మణుగూరు మండల రైతుబంధు అద్యక్షులు రామసహాయం వెంకట్ రెడ్డి, మణుగూరు టౌన్ మహిళా అధ్యక్షురాలు తుంగల చంద్రకళ, మణుగూరు టౌన్ యూత్ ప్రెసిడెంట్ రుద్ర వెంకట్, దామెర కుమారస్వామి, పొడుతూరి విక్రమ్, రామంచి కోటేశ్వరరావు, కోరి శ్యామల,చీమల భవాని, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.