UPDATES  

 ఆర్థిక నేరగాళ్లకు అండగా బిజెపి.. టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు …

  • ఆర్థిక నేరగాళ్లకు అండగా బిజెపి
  • టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు
  • దొంగలకు దోచిపెట్టడమే మోడీ పనంటూ విమర్శలు
  • గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి..

దేశంలో ఆర్థిక నేరగాళ్లకు అండగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, గుజరాతి దొంగలకు వత్తాసు పలుకుతున్నారని టీపీసీసీ సభ్యులు నాగా సీతా రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నాగా సీతారములు ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం నిరసన దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా దీక్షను ఉద్దేశించి నాగా సీతారాములు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆర్థిక నేరగాళ్లకు మోడీ సపోర్ట్ ఉందన్న విషయం అందరికి తెలుసన్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, నీషన్ మోడీ మొదలుకొని దాదాపు 25 మంది ఆర్థిక నేరగాళ్లు దేశంలో 60 శాతం ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టారని అన్నారు. వీరందరు గుజరాత్ వారేనన్న నిజాన్ని ఒప్పుకునే ధైర్యం బీజేపీ నాయకులకు ఉందా అంటు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దొంగను బరాబర్ దొంగ అంటామని ఎన్ని కేసులైన పెట్టుకోవాలని, జైళ్లకు భయపడేది లేదని హెచ్చరించారు. 14 మంది ప్రధానులు చేసిన 56 లక్షల కోట్ల అప్పు కంటే ఒక్క మోడీ చేసిన అప్పు 100 లక్షల కోట్లని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లేని ప్రభుత్వ రంగాల నష్టాలు మోడీ ప్రభుత్వం వచ్చాక ఎందుకు నష్టాల బాటలో నడుస్తున్నాయని ప్రశ్నించారు. చేతకాని దద్దమ్మ మోడీ అని విమర్శించారు. మరోవైపు దేశ సంపదను ఆదాని, అంబానీలకు దోచిపెట్టడమే మోడీ ప్రథమ కర్తవ్యం అని అన్నారు. గుజరాతి దొంగల భరతం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. వాస్తవాలను ప్రశ్నిస్తున్నందుకు రాహుల్ గాంధీ పై తప్పుడు కేసులు బనాయించి రెండు ఏళ్ల శిక్ష వేశారని, ఇదంతా బిజెపి కుట్ర అని అన్నారు. రాహుల్ పై వేసిన అనర్హత వేటు కూడా మోసమేనని అన్నారు. రాబోయే రోజుల్లో బిజెపి సర్కార్ ను దానికి వత్తాసు పలుకుతున్న బిజెపి నాయకులను గ్రామాల్లో తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. కుల మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బిజెపి నాయకులారా ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మడిపల్లి శ్రీనివాసులు, జిల్లా మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ కరీం పాషా, సుజాతనగర్ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు లోశెట్టి నాగార్జున, కిసాన్ కాంగ్రెస్ జిల్లా సెక్రెటరీ అజ్మీర మోహన్, ఓబీసీ జిల్లా కార్యదర్శి బాలు భద్రరావు, సుజాతనగర్ మండలం మైనార్టీ అధ్యక్షులు షేక్ సైఫుద్దిన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సింగ్ బిక్షం, జుత్తు శ్రీనివాస్, కోసిన ప్రభాకర్, వార్డ్ మెంబర్లు గరిక జయరాజు, మొగిలి శ్రీను, చిమట చంద్రయ్య, మాజీ ఉపసర్పంచ్ చిమట చిన్న వెంకటేశ్వర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు తెల్లబోయిన వెంకటేష్, మురిపెడి గణేష్, షేక్ అజ్జూ, తేజావత్ సాయి, తెల్లబోయిన కోటేష్, తెల్లబోయిన కవిన్, నాళం సాగర్, తాళ్లూరి స్వామిదాసు, బానోతు వీరన్న ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !