మన్యం న్యూస్, ఇల్లందు టౌన్:కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ బుధవారం ఢిల్లీలో నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ జీరో వ్యర్థ దినోత్సవం సందర్భంగా వ్యర్థ రహిత నగరాల కొరకు ర్యాలీకి తెలంగాణ రాష్ట్రం నుంచిఆహ్వానం అందుకున్నన్నట్లు ఇల్లందు మునిసిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మంగళవారం పత్రికా ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి హాజరై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి దేశ వ్యాప్తంగా వ్యర్థ నిర్మూలన కొరకు తీసుకున్నటువంటి చర్యలు, ఉత్తమ పద్ధతుల గురించి చర్చించనున్నట్లు తెలిపారు. అనంతరం చెత్త రహిత నగరాల తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి తెలంగాణరాష్ట్రం నుంచి తనకు ఆహ్వానం అందడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఢిల్లీలో జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక మున్సిపాలిటీ ఇల్లందేనని తెలిపారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ, స్థానిక శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియనాయక్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక వార్డు కౌన్సిలర్లు, అధికారులు, పార్టీ పెద్దలు పట్టణ ప్రజల సహకారంతోనే ఈ అవకాశం తనకు దొరికిందని తెలిపారు. ఇల్లందు పట్టణ కీర్తిని బుధవారంనాడు రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో ఇల్లందు మున్సిపాలిటీ తరపున ఐదు నిమిషాల వీడియోని ప్రదర్శించనున్నారని ఈ సందర్భంగా డీవీ తెలిపారు.
