మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
వేసవి కాలంలో తలెత్తే నీటి ఎద్దడి గ్రామాలను గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టి ప్రజలకు తాగునీరు నిరంతరయంగా అందించాలని మండలంలోని ప్రధాన కూడలిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చుంచుపల్లి ఎంపీడీవో సకినాల రమేష్ సూచించారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని 18 గ్రామపంచాయతీలో తాగునీటి ఎద్దడి పై ప్రత్యేక పరిశీలన చేశారు. అయ్యా పంచాయతీల్లోని పాలకవర్గ సభ్యులతో సర్పంచులు ఎంపిటిసి లతో ఆయన మాట్లాడారు. మండలంలోని ఆయా పంచాయతీలో ఎక్కడైతే తాగునీటి సమస్య ఎదురవుతుందో తక్షణమే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఆయా పంచాయతీలో సరఫరా అవుతున్న నీటి పథకాలను సమర్థవంతంగా నిర్వహించాలని అవసరమైతే తక్షణంగా మరమ్మతులు చేపట్టి తాగునీటి సరఫరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు.ఏప్రిల్ 1 న అన్ని గ్రామ పంచాయతీల హెడ్ క్వార్టర్స్ లలో జన సమర్థం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో మేజర్ గ్రామపంచాయతీలలో ప్రధాన కూడలలలో చలివేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని, తద్వారా పాదచారులు బాటసారులకు తాగునీటి ఇబ్బంది లేకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అవసరమున్న చోట మజ్జిగ ప్యాకెట్ లను దాతల ద్వారా ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రతి చలివేంద్రం వద్ద ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని తద్వారా వడదెబ్బలు తగలకుండా నివారించే ప్రయత్నాలు చేయాలని అందరికీ ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యాక్రమములో మండల పంచాయతీ అధికారి గుంటి సత్యనారాయణ అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ పాలకమండలి , స్థానిక ప్రజలు, చేతిపంపు మెకానిక్ పంపు ఆపరేటర్లు పాల్గొన్నారు.





