UPDATES  

 గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి…  సిడిపిఓ నిర్మల జ్యోతి…

మన్యం న్యూస్ చండ్రుగొండ మార్చి 28 : గర్భిణీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని సిడిపిఓ నిర్మలా జ్యోతి అన్నారు. మంగళవారం చండ్రుగొండ, రావికంపాడు సెక్టార్లలో జరిగిన పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు శ్రీమంతాలు,చిన్నారులకు అక్షరాభ్యాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ… చిన్నారులు వయస్సుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలన్నారు. మహిళలు రక్తహీనత సమస్య రాకుండా జాగ్రత్తలు పడాలన్నారు. పిల్లలకు పోషక విలువలు కలిగిన ఆహారం పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ రన్య, సూపర్వైజర్లు రాణి, శకుంతల, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, అంగన్వాడి టీచర్లు బూచమ్మ, అరుణ,సుజాత,మీనాక్షి,వినోద,విజయ, మంగ,మనీ, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !