మన్యం న్యూస్ చండ్రుగొండ మార్చి 28 : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పతనం ప్రారంభమైనదని ప్రజలలో మోడీ పతనం సైతం ఆరంభమైనదని అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు విమర్శించారు. మంగళవారం ప్రధాన సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వేటుకు నిరసన దీక్షను మండల కాంగ్రెస్ చెపట్టింది.ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడే సూచనలు కనపడుతున్నాయని, అవినీతిపరులకు బిజెపి ప్రభుత్వం అందలం ఎక్కిస్తుందన్నారు. అనంతరం ఇటీవల బ్లడ్ క్యాన్సర్ తో తలారి నవీన్ అనే యువకుడు మృతి చెందాడు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి మనోధైర్యాన్ని తెలిపారు. ఆయన వెంట జడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులుగుగ్గులోతు బాబు, కేశవ అయిన నరసింహారావు,సంకా కృపాకర్, అంతటి రామకృష్ణ, ఇస్లావత్ రుక్మిణి, బడుగు కృష్ణవేణి, పద్దం వినోద్, బొర్రా సురేష్, రెడ్డిపోగు సురేష్, చాపలమడుగు మనోహర్, కుంచపు కన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.