మన్యం న్యూస్,ఇల్లందు టౌన్…:అఖిల భారత కాంగ్రెస్ పార్టి, తెలంగాణ రాష్ట కాంగ్రెస్ కమిటి పిలుపు మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీపై పార్లమెంట్ సభ్యత్వం అనర్హత వేటుకు నిరసనగా ఇల్లందు నియోజకవర్గ కేంద్రం జగదాంబ సెంటర్ నందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సంకల్ప సత్యగ్రహ ధీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ దీక్షలో తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి గోపాల్ రెడ్డి, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి మార్గదర్శకంగా నిలిచి, దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి నెహ్రు గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు మరియు నూటనలబై కోట్ల ప్రజాగొంతుక అయినటువంటి రాహుల్ గాంధీపై పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హత వేటు వేయడం ప్రజా స్వామ్యానికి గొడ్డలి పెట్టుగా అభివర్ణించారు. భారతదేశం ఈనాడు అగ్రదేశాలతో పోటిపడుతుంది అంటే కారణం ఈ దేశానికి దాదాపు అరవై సంవత్సరాలపాటు పాలించి కనీసం గుండుపిన్ను కుడా ఉత్పత్తి చేసే సామర్ధ్యంలేని ఈ దేశం నేడు ఏన్నో ఉత్పత్తిరంగ సంస్ధలు, విద్య, వ్యవసాయం, ఉద్యోగాలు వంటి వాటిని నెలకొల్పి దేశాన్ని సుసంపన్న దేశంగా తీర్చిదిద్దిన ఘనత గాంధీల కుటుంబానిదేనని,ఈ గౌరవం కాంగ్రెస్ పార్టికే దక్కుతుంది అని పేర్కొన్నారు. వారి వారుసుడైన రాహుల్ గాందీపై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తు, అనర్హత వేటు వేయడం కాకుండా జైలుశిక్ష విధించారని, రాహుల్ గాంధీ కోసం ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరు జైలుకు వెళ్ళడానికి సైతం సిధ్ధం అని తెలియజేసారు. తక్షణమే రాహుల్ గాంధీపై అనర్హత వేటును వెనక్కి తీసుకోవాలని , లేనిపక్షంలో తీసుకునేంతవరకు పోరాడదాం అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షకు సంఘీభావం తెలిపిన స్థానిక టీడీపీ,సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులకు చీమల వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సత్యాగ్రహదీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ పట్టణ,మండల అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి గోపాల్ రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.ఈ సత్యగ్రహ దీక్షలో ఇల్లందునియోజకవర్గ ఏ,బీ బ్లాక్ అధ్యక్షులు జలిల్, మండల,టౌన్ అధ్యక్షులు పులి సైదులు, దొడ్డా డానియల్, బేతంపుడి సోసైటి చెర్మెన్ లక్కినేని సురేందర్, దళ్ సింగ్, అడ్వకేట్ అరెంపాపారావు, కామేఫల్లి, గార్ల, బయ్యారం, టేకులపల్లి మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, ధనియాకుల రామారావు, కంబాల ముసలయ్య, భుక్యా దేవానాయక్, బయ్యారం మండల ప్రచార కార్యదర్శి మోహన్, ఇల్లందు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్టి హరిక్రిష్ణ, ఐఎన్టీయూసీ నాయకులు లింగాల జగన్నాధం, పట్టణ, మండల ప్రధాన కార్యదర్శులు జాఫర్, పూనెం శ్రీరాములు, సర్పంచ్లు ధనసరి స్రవంతిరాజు, కారం భాస్కర్, తాళ్ళగూడెం, బధ్ధు తండా, సీతంపేట ఎంపిటిసిలు నల్లమోతు లక్ష్మయ్య, ఊకే రామక్రిష్ణ, గుండెబోయిన నాగమణి, గార్ల మండల మహిళ అధ్యక్షురాలు గంగ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.
