మన్యం న్యూస్, మణుగూరు , మార్చి28: టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య ఆదేశాల మేరకు పినపాక నియోజకవర్గ కేంద్రమైన మణుగూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ ఆధ్వర్యంలో మంగళవారం ఒక్కరోజు సంకల్ప సత్యగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే , సీనియర్ నాయకులు చందా లింగయ్య దొర పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దును వ్యతిరేకిస్తూ సంకల్ప సత్యాగ్రహ దీక్షను చేపట్టడం జరిగిందన్నారు. దేశ ఐక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టడంతో వచ్చిన ప్రజా ఆదరణను చూసి జీర్ణించుకోలేక పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం అనేది బిజెపి చేస్తున్న కుట్ర అన్నారు . అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా పోరాటం చేయడం ప్రధాని మోడీకి కంటి మీద కునుకులేకుండా చేస్తుందన్నారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ కి ప్రజల్లో మరింత ఆదరణ లభించడం జీర్ణించుకోలేని బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీ పై వేసిన అనర్హత వేటు రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచడమే
నన్నారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ను తొలగించేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి , సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి ,ఆవుల సర్వేశ్వరరావు, కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, పినపాక మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం , అశ్వాపురం మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య , బీ బ్లాక్ అధ్యక్షురాలు బర్ల నాగమణి ,కరకగూడెం మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ , నియోజకవర్గ మహిళా నాయకురాలు బోగినేని వరలక్ష్మి , గొంది రాధ ,నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.