మన్యం న్యూస్ గుండాల..ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆళ్లపల్లి మండలంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని సూచించడంతో పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు తప్పకుండా హాజరుకావాలని పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, సోషల్ మీడియా నాయకులు తప్పకుండా హాజరుకావాలని కోరారు. ఈ సమావేశం బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు
