మన్యం న్యూస్, బూర్గంపాడు/సారపాక :
భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు పొదెం వీరయ్య ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీకి హితవు పలికారు. మండల పరిధిలోని సారపాక రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దును వ్యతిరేకిస్తూ భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేస్తున్న సంకల్ప సత్యగ్రహ దీక్ష శిబిరం ఏర్పాటు చేసి బూర్గంపహాడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుగ్యంపూడి కృష్ణారెడ్డి నాయకత్వంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఏం చేశారనేది అందరికీ, అన్ని పార్టీలకు తెలుసని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేయవద్దని మోడీకి హితవు పలికారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటును వెంటనే ఉపసంహరించుకోవాలని మోడీకి హెచ్చరికలు జారీ చేశారు. అఖిలపక్షాలు రాహుల్ గాంధీకి మద్దతు తెలియజేస్తున్నాయని, మోడీ చర్యలను అఖిలపక్షాలు ఖండిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. మోడీ చర్యలపై అన్ని పార్టీలు, యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండిస్తుంటే మోడీకి కళ్ళు లేవా అంటూ ఎద్దేవా చేశారు. ఆదాని అక్రమాలను కప్పిపుచ్చుకొనుట కొరకు ప్రజల దృష్టిని మళ్లించుట కొరకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు తాళ్లూరి చక్రవర్తి, జిల్లా మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బెల్లంకొండ వాసుదేవరావు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పూలపల్లి సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెల్లా వెంకటనారాయణ, సారపాక టౌన్ అధ్యక్షులు వెల్లంకి రాము, నియోజకవర్గ నాయకులు కనితి కృష్ణ, నుపా సురేష్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు చోటే, వాజిద్, మహిళా నాయకురాలు కుంజ రమణ, దేవి, షరీఫ్ సంకల్ప సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు.