మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మార్చి 29
సింగరేణి ట్రేడ్స్ మెన్ లకు ట్రాన్సఫర్ కౌన్సెలింగ్ నిర్వహించాలి అని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి వల్లూరు.వెంకటరత్నం డిమాండ్ చేశారు.బుధవారం సిఐటియు ఆఫీసులో టీవీయంవి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ,అనేకమంది ఈపి టెక్నీషియన్స్ అనగా ఈపీ ఫిట్టర్,ఈపి ఎలక్ట్రిషన్ 2019 నుంచి కౌన్సిలింగ్ లేకుండా పోస్టింగులు తీసుకొని అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.వీరికి గత సంవత్సరం జూన్ నెలలో కౌన్సిలింగ్ కొరకు అప్లికేషన్స్ ఆహ్వానించిన యాజమాన్యం ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలు పెట్టకుండా,అనేక కారణాలు చెబుతూ వాయిదా వేస్తున్నదని విమర్శించారు.ఉత్పత్తి సంవత్సరం ముగిసినందున ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి,కౌన్సిలింగ్ నిర్వహించి వారి యొక్క సొంత ఏరియాలకు వెళ్లే విధంగా అవకాశం కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో నాయకులు ఈశ్వరరావు, రామ్మూర్తి,లక్ష్మణరావు,విల్సన్,రాజు,పి.లక్ష్మణరావు,పారుపల్లి ప్రభాకర్ రావు,శంకర్, సత్యనారాయణ,రమేష్ తదితరులు పాల్గొన్నారు