UPDATES  

 స్వచ్ఛ మాషాల్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్..

  • స్వచ్ఛ మాషాల్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్
  • చెత్తను వేరు చేసి పర్యావరణాన్ని కాపాడుదాం .. ఎమ్మెల్యే హరిప్రియ పిలుపు

 

మన్యం న్యూస్, ఇల్లందు టౌన్.:దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా బుధవారం ఇల్లందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో జగదాంబ సెంటర్ నందు మెప్మా సిబ్బంది సహకారంతో స్వచ్ఛ మాషాల్ మార్చ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ.. స్వచ్ఛత మహోత్సవాలలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి పర్యావరణాన్ని కాపాడుకుందాం అని కాలుష్యారహిత సమాజాన్ని నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. స్వచ్ఛ మున్సిపాలిటీగా ఇల్లందు మున్సిపాలిటీకి దేశస్థాయిలో 18 ర్యాంకు వచ్చిందని మున్ముందు దేశ స్థాయిలో అగ్రగామిగా నిలబడేందుకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు. అనంతరం స్వచ్ఛత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ మార్షల్ మార్చ్ కార్యక్రమం జగదాంబ సెంటర్ నుండి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఇల్లందు మున్సిపాలిటీ కమిషనర్ అంకుషావలి, బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావు, కౌన్సిలర్లు కటకం పద్మావతి, సయ్యద్ ఆజం, బారాస పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, ఇల్లందు మున్సిపాలిటీ ఏఈ శంకర్,ఆర్.ఐ. శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, సుధీర్, మెప్మా సిబ్బంది యశోద, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !