మన్యం న్యూస్ దుమ్మగూడెం::
విద్యార్థులు ఏకాగ్రతతో ఒత్తిడి లోనవ్వకుండా పరీక్షలు రాసి ఉన్నత విద్యను అభ్యసించాలని దుమ్ముగూడెం జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆపక శంకర్ అన్నారు. బుధవారం పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువు ద్వారానే జీవితంలో రాణిస్తారని అత్యుత్తమంగా పరీక్షలు రాసి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు అనంతరం పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ముసలి రాంబాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం దుమ్ముగూడెం కేంద్రంలో పరీక్ష కేంద్రం లేకపోవడం చాలా బాధాకరమని పిల్లలు క్రమశిక్షణతో సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు అనంతరం పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సతీష్ రజని విద్యా కమిటీ మెంబర్ హుస్సేన్ అహ్మద్ గ్రామస్తులు శ్రీనుబాబు సీతారామరావు సతీష్ వీర్రాజు సత్యనారాయణ మల్లూరు పెద్దలు పాల్గొన్నారు