మన్యం న్యూస్, మణుగూరు, మార్చి28: ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు నందు చేరాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాస్ కోరారు. ఆయన బుధవారం నిర్వహించిన దోస్త్ అడ్మిషన్ కాంపెయినింగ్లో పాల్గొని మాట్లాడారు. ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులకు అనుకూలంగా అన్ని సౌకర్యాలతో మణుగూరు కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రయివేట్ కళాశాలలకు ఏమాత్రం తీసిపోకుండా విద్యార్థులకు బోధన అందించడం జరుగుతుందన్నారు. ఎంతో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యార్థులకు విద్య బోధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రామ తిరుపతి, భాస్కర్, అశోక్, నాగిరెడ్డి, సాంబమూర్తి, శిరీష, సతీష్, జబ్బార్ , సువర్ణ, స్రవంతి పాల్గొన్నారు.