మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండలం జానంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ డే వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంకు ఈ బయ్యారం ఎస్సై నాగుల్ మీరా ఖాన్ హాజరయ్యారు. విద్యార్థినీ, విద్యార్థులు ఆటపాటలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రమణ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుకునే దశలోనే అన్నిరంగాలపై అవగాహన పెంచుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా రాణించి జీవితంలో పైకి రావాలని ఆకాంక్షించారు. స్థానిక ఎస్ఐ నాగుల్ మీరా ఖాన్ మాట్లాడుతూ, తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలన్నారు. సమాజంలో విలువలు నేర్చుకోవాలని, జీవితంలో చదువు అనేది ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు సోషల్ మీడియాలో జరిగే సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు