మన్యం న్యూస్ చండ్రుగొండ, మార్చి29:
ఏప్రిల్ రెండవ తేదీన అయ్యన్నపాలెంలోని లాక్ష్య గార్డెన్లో నిర్వహించే బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు(ధారాబాబు) కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆత్మీయ సమ్మేళనానికి అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారధి రెడ్డి, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణంలు హజరవుతారన్నారు. మండలంలోని బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సహకార సంఘం బాధ్యులు అందరూ హజరై విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, గుంపెన సోసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, సర్పంచ్లు పూసం వెంకటేశ్వర్లు, బానోత్ కుమారి, సీనియర్ నాయకులు మేడా మోహన్రావు, భూపతి రమేష్, జడ వెంకయ్య, చాపలమడుగు రామరాజు, చీదెళ్ల
పవన్ కుమార్, బానోత్ బీలు, సూర వెంకటేశ్వరరావు, వంకాయలపాటి బాబురావు, బాషా, పాండ్ల అంజన్ రావు, ఆంగోతు శ్రీను, హనుమంతరావు, శ్రావణ్, తదితరులు పాల్గొనారు