మన్యం న్యూస్ గుండాల..మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. టిడిపి పార్టీ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని సాగర్వంగా నిలబెట్టిందని మండల అధ్యక్షులు తోలెం సాంబయ్య అన్నారు. రానున్న రోజుల్లో పార్టీకి పూర్వ వైభవం రానున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇల్లందుల అప్పారావు, ఇల్లందుల నరసింహులు, మొల్కం రామకృష్ణ , యాకయ్య, మల్లయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు