మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
మండలంలోని లక్ష్మీనగరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు కొమరం దామోదర్ రావు జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిందని ఇప్పటికీ తెలుగు ప్రజల్లో తెలుగుదేశం పార్టీ చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారని ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు గ్రహిస్తున్నారని రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకే తగిన గుణపాఠం చెబుతారని కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి కెల్లా వేణుగోపాల్ నవీన్ భాస్కర్ రెడ్డి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.