మన్యం న్యూస్,ఇల్లందు టౌన్: మహిళలు ఉపాధిరంగంలో రాణించి ఎవరి అండదండలు లేకుండా వారి స్వశక్తితో ఎదగాలని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ పట్టణ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ అందించిన విషయం అందరికీ విధితమే. అంధులో భాగంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, భవన ఇతరరంగ కార్మికుల సంక్షేమ మండలి వారి సౌజన్యంతో మూడునెలలకు కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు బుధవారం ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ఇరవై ఆరు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ.. మహిళలు స్వశక్తితో ఎదిగి ఉపాధి రంగంలో రాణించి వారు ఎంచుకున్న రంగంలో అభివృద్ధిని సాధించాలని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆకాంక్షించారు. శిక్షణ పొందిన విభాగంలో మెలకువలు పాటించి ఆదాయ వనరులుగా మరల్చుకొని తమ జీవిత ఆశయాలను చేరుకునే విధంగా కృషిచేయాలని ఎమ్మెల్యే మహిళలకు సూచించారు. శిక్షణ పొందిన మహిళలు కేవలం ఇంటికి పరిమితం కాకుండా ఆదాయ వనరులుగా ఏర్పరచుకొని ఆర్థిక పురోగతి సాధించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏవో రమేష్, ఏడి హసీఫ్, సిజిఎస్జి నాగమణి, ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు, ఇల్లందు పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్ఛార్జి గిన్నారపు రాజేష్, ఇల్లందు మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పూదురు లక్ష్మీనారాయణ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సత్తాల హరికృష్ణ, పాలడుగు రాజశేఖర్, ఇందిరానగర్ వార్డు మెంబర్ నీలం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.