మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
పుట్టిన ప్రాంతానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఉదయ్ హాస్పిటల్ డాక్టర్ తెలిపారు. మండలంలోని లక్ష్మీ నగరం గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో భద్రాచలం ఉదయ్ హాస్పిటల్ వారిచే బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి వైద్య పరీక్షలు చేపించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉదయ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామీణ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాలు పెట్టి తమ వంతు సహాయ సహకారం అందిస్తామని అలానే ఉదయ్ హాస్పిటల్ నందు ప్రతి గురువారం పేదవారికి ఎటువంటి ఓపి లేకుండా ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ మండలంలోని వైద్య శిబిరాలు పెడుతూ కూడిన మందులు ప్రజలకు అందిస్తున్న ఉదయ హాస్పిటల్ యాజమాన్యాని సిబ్బందిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లం సీతమ్మ జడ్పిటిసి రేసు లక్ష్మి సర్పంచ్ రాజమ్మ టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి రాముడు ఉపసర్పంచ్ గుడ్ల రాంబాబు సిపిఎం జిల్లా నాయకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు