మన్యం న్యూస్ వాజేడు
వాజేడు మండల పరిషత్ కార్యాలయంలో సిపిఆర్ పైన అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ కోమరం మహేందర్, మధుకర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. మనిషి జీవితంలో ఎన్నో రకాల సందర్భాలలో గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. మానవుని గుండె ఆగిపోయినప్పుడు, హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు, సి పి ఆర్ ప్రాథమిక చికిత్స చేయడం ద్వారా నిండు ప్రాణాలను సైతం కాపాడగలమని ప్రజల మధ్యలో ఉండే వారు కచ్చితంగా సిపిఆర్ తెలుసుకుని ఉండాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఒ సర్దార్ సింగ్ ఎంపీడీవో విజయ ఎస్ఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు.