మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మార్చి 29
మణుగూరు ఏరియా జిఎం కార్యాలయం లో ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ అధ్యక్షతన, ఏరియా ఉన్నత అధికారులతో ఆడిట్ మీటింగ్ నిర్వహిచడం జరిగింది.ఈ సందర్భంగా ఏరియా జిఎం దుర్గం రామచందర్ మాట్లాడుతూ, సింగరేణి ఓ ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా భాద్యతాయుతంగా జవాబుదారీ తనంతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. కాబట్టి ఏరియా ఆడిట్ మీటింగ్ ప్రతి మూడు నెలలకు జరుగాల్సి ఉంటుంది అన్నారు. ఆడిట్ చెయ్యడం వల్లన ఏదైనా తప్పు జరుగుతే ముందే తెలుసుకొని సరిదిద్దుకోవడం జరుగుతుంది అని తెలిపారు. అంతే కాకుండా ఇలాంటి తప్పులు పునారావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్నారు. సంబంధిత గనుల,డిపార్ట్మెంట్ల ఉన్నత అధికారులు,పిఓ లు, క్లేరికల్ సిబ్బంది,త్రైమాసిక, ఆడిట్ ప్రక్రియను తప్పనిసరిగా కొనసాగించాలి అని తెలిపారు. ప్రతి ఉద్యోగి ప్రమోషన్, పేమెంట్ విషయంలో త్వరగా ఎలాంటి జాప్యానికి ఆస్కారం లేకుండా కృషి చెయ్యాలి అన్నారు.అలాగే ఆడిట్ నివేదికలో వచ్చిన తప్పులను సరిచేసి,కంప్లియెన్స్ రిపోర్ట్ సకాలంలో సమర్పించాలని జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ సిబ్బందిని, అధికారులను సూచించారు.
అనంతరం డిజిఎంఇంటర్నల్ ఆడిట్. భీబత్స మాట్లాడుతూ, ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం.రామచందర్,సారధ్యంలో బొగ్గు ఉత్పత్తి లక్షాలను సాధించడం ఎంతో అభినందనీయం అన్నారు. వార్షిక ఆడిట్ కార్యక్రమంలో బాగంగా ఆడిట్ డిపార్ట్మెంట్ సర్ప్రైస్ చెకింగ్ హాజరు మీద, మెటేరియల్స్ మీద చేస్తుంది అన్నారు.ఉద్యోగుల వేతనాలు ఫిక్సేషన్,కాంట్రాక్టర్స్ అండ్ సప్లయర్స్ బిల్ల్స్ తదితర అంశాలను ఆడిట్ నిర్వహించి, ఆడిట్ బోర్డు కు రిపోర్ట్ అందచేస్తామని తెలిపారు. కంపెనీ లో ఏరియా ఆడిట్ కంపెనీ స్టాట్యుటరి ఆడిట్, కంట్రోలర్ ఆడిట్ అండ్ జనరల్,కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ స్టాండింగ్ ఆడిట్ చేస్తారు.ఉద్యోగులకు ప్రమోషన్స్ అండ్ పేమెంట్స్, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవడం ఎంతో అభినందనీయం అన్నారు.అదే విధంగా ఆడిట్ క్వరీస్, కంప్లైంట్స్ రిపోర్ట్ 15 రోజులలో వ్రాత పూర్వఖంగా తెలియ చేయవలసి ఉంటుంది అని తెలిపారు.కాపిటల్ మెటీరియల్స్ సాధ్యమైనత త్వరగా ఉపయోగంలోకి తీసుకు రావటం వలన గ్యారంటీ, వారంటీ అలాగే సంస్థ కు ఖర్చుల పద్ధూ కూడా తగ్గుతుంది అని,తద్వారా టాక్స్ చెల్లింపు కూడా కంపనీ కు తగ్గుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎస్ టు జిఎం జే వెంకట రమణ, ఏజిఎం కేపియూజి జి.నాగేశ్వర రావు,ఏజిఎం సివిల్ డి. వెంకటేశ్వర్లు,ప్రాజెక్టు అధికారి పికేఓసి టి లక్ష్మీపతి గౌడ్,ప్రాజెక్ట్ ఇంజినీర్ పికేఓసి వీరభద్రుడు, ప్రాజెక్ట్ ఇంజినీర్ ఎంఎన్ఐఓసి రవీందర్,డిజిఎం కేసిహెచ్పీ సురేశ్,డిజిఎం ఐఈడి కే. వెంకట రావు,డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్,డాక్టర్ శేషగిరి, డిజిఎం పర్చేస్ శ్రీనివాస మూర్తి,ఓసీ-4 మేనేజర్ డి. శ్రీనివాస్,ఎంవిటిసి మేనేజర్ నాగేశ్వర రావు,ఫీనాన్స్ మేనేజర్ అనురాధ సీనియర్ సెక్యూరిటీ అధికారి ఎండీ అబ్దుల్ షబ్బీరుద్దీన్,సీనియర్ పర్సనల్ అధికారులు పి బి అవినాష్,సింగు శ్రీనివాస్,ఎండి మదార్ సాహెబ్,సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు రమేశ్, ప్రశాంతి,సంధ్య రాణి,ఐటి ప్రోగ్రామర్ సాయిల సురేశ్, ఇతర అధికారులు క్లరికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.