మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం .
వెంకటాపురం మండలo గొల్లగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది రోజు లాగానే కూలీలు తమ మిర్చి పనులు ముగించుకొని మధ్యాహ్నం భోజనం వేళ అవ్వడంతో భోజనo చేయడానికి పని దిగి అన్నం తిన్నాక నీళ్ల కోసమని పక్కనున్న మిర్చి చేనులో డ్రిప్ నీరు తాగగా అవి అప్పుడే పక్కనున్న మిర్చి రైతు మందు కలిపి చేనుకు తడి పెట్టిన విషయం గమనించ పోవడం వల్ల తాగిన 30 మంది కూలీలు వరుసగా ఆస్వస్థతకు గురయ్యారు. వెంటనే చుట్టూ ఉన్నవారు వారిని గమనించి హుటా హుటిన చుట్టుపక్కల ఉన్న రైతులు వారిని దగ్గరలో ఉన్న వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, వెంటనే హాస్పటల్ సిబ్బంది డాక్టర్ వెంటనే వారికి వైద్య పరీక్షలు కొనసాగించి వారిని ప్రాణాపాయం నుంచి తప్పించడంలో వారు కృషి చేశారు. తీవ్రస్థాయిలో ఉన్న వారిని ఎటునాగారం ఏరియా హాస్పిటల్ కు పంపినట్టుగా డాక్టర్ శ్రీకాంత్ తెలియజేశారు. ఉన్నవారిలో చాలావరకు సమయానికి తీసుకురావడంతో ప్రాణాపాయం నుంచి తప్పించగలిగామని వారు తెలియజేశారు.