UPDATES  

 నవమి వేడుకల్లో ఆకర్షణగా నిలిచిన చిరుధాన్యాల పోషకాహార అవగాహన..

మన్యం న్యూస్ దుమ్ముగూడెం::

పర్ణశాల లో గురువారం జరిగే సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు జరుగుతుండగా మరోపక్క వేలాది మంది భక్తులు దైవదర్శనానికి వచ్చి వెళుతున్న క్రమంలో బుధవారం పర్ణశాలలో ఐసిడిఎస్ సిడిపిఓ సలోమి ఆధ్వర్యంలో చిరుధాన్యాల పోషకాహార అవగాహన సదస్సు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రజలలో మహిళలలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఈ పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది ఈ అవగాహన కార్యక్రమంలో పలువురు గర్భిణీ స్త్రీలకు సీమంతాలు జరిపి చిన్నారులకు అన్నప్రాసన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాలు ఏర్పాటు చేసి వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు ఈ సందర్భంగా పర్ణశాల పుణ్యక్షేత్రానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు కైకలూరు ప్రాంతానికి చెందిన దంపతులకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ రేసు లక్ష్మి జెడ్పిటిసి తెల్లం సీతమ్మ పర్ణశాల గ్రామపంచాయతీ సర్పంచ్ వరలక్ష్మి ఐసిడిఎస్ పిడి లేనినా లు ముఖ్య అతిథులుగా పాల్గొనగా ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు చంద్రకళ, కల్లూరి ధనలక్ష్మి, జి.ధనలక్ష్మి, షహనా సుల్తానా, సావిత్రి,  మణి  అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !