మన్యం న్యూస్ వాజేడు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం చింతూరు గ్రామపంచాయతీ, కొరకల్లు గ్రామంలో బుధవారం నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమానికి ములుగు జిల్లా క్వాలిటీ కంట్రోల్ టీం పర్యవేక్షణ చేశారు. కంటి వెలుగు శిబిరం లో గ్రామస్తులతో మాట్లాడారు. కళ్లద్దాలు ఇస్తున్నారా, కంటి పరీక్షలు నాణ్యతగా చేస్తున్నారా విషయాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ములుగు క్వాలిటీ కంట్రోల్ టీం డాక్టర్ రాజన్న, ప్రవీణ్, రెడ్డి, స్వరూప, డిడిఎం ప్రవీణ్, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి, లక్ష్మి ,శారద, శ్రీదేవి, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.