మన్యం న్యూస్ చండ్రుగొండ మార్చి 30 : మండల వ్యాప్తంగా శ్రీరామనవమి సందర్భంగా గ్రామ గ్రామాన భక్తిశ్రద్ధలతో భక్తులు సీతారాముల కళ్యాణం గురువారం పోకలగూడెంలోని భక్తాంజనేయ ఆలయంలో , తిప్పనపల్లి కోదండరాముడు చండ్రుగొండలోని మహాలక్ష్మి ఆలయంలో , అయ్యన్నపాలెం భక్తాంజనేయ గుర్రంగూడెం భక్తాంజనేయ ఆలయంలో, బెండాలపాడు భక్తాంజనేయ ఆలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు, బెల్లం పానకాలు, పులిహోర ప్యాకెట్లు అందజేశారు.