మన్యం న్యూస్, మణుగూరు, మార్చి 31: మణుగూరు ఏరియా వంద పడకల ఆసుపత్రి లో నిర్వహించే ఉచిత కంటి ఆపరేషన్స్ ని సద్వినియోగం చేసుకోవాలని ఆఫ్తాల్మిక్ ఆఫీసర్ డాక్టర్ జి. సంజీవరావు శుక్రవారం అన్నారు. మణుగూరు ఏరియా ఆసుపత్రి లో ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి శుక్లాలు ముదిరిన వారిని ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుందన్నారు. వారికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కంటి ఆపరేషన్స్ చేయిస్తుందన్నారు. కంటి ఆపరేషన్స్ చేయించుకొని వచ్చిన వారికి ఏరియా ఆసుపత్రిలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఆర్ఎంవో డాక్టర్ నరేష్ చేతుల మీదుగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.