మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
కార్పొరేట్ ఏరియాలో వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ కోరుతూ ఏప్రిల్ 1 శనివారం సింగరేణి సివిల్ కార్యాలయం ముందు సాయంత్రం ఐదు గంటలకి జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శలు, డి వీరన్న, సురం ఐలయ్య కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని రైటర్ బస్తి, హెడ్ ఆఫీస్, ట్రాన్సిట్ గెస్ట్ హౌస్ తదితర ఏరియాలలో జరిగిన గ్రూప్ మీటింగ్లలో వారు పాల్గొని మాట్లాడుతూ గతంలో సింగరేణి యాజమాన్యం సమ్మె సందర్బంగా ఇచ్చిన హామీలు ఏరియార్స్ వెంటనే ఇవ్వాలని, ఏడో తారీఖు లోపు ప్రతినెల జీతాలు ఇవ్వాలని, కాంట్రాక్టర్ కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా ఆసుపత్రి సేవలు అందించాలని, అలాగే కరోనా టైంలో మరణించిన కార్మికులకు 15 లక్షల రూపాయలు
ఎక్స్ గ్రేషియా ఇస్తానన్న హామీలు వెంటనే అమలు చేయాలని కోరుతూ శనివారం సివిల్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నరు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి శ్యామ్ నాయకులు ప్రభాకర్, సంజీవ్, కృష్ణ సుందర్ సురేష్ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు