మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
మండలంలోని అచ్చుతాపురం కే లక్ష్మీపురం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ఎంపీపీ రేసు లక్ష్మి , మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంక అబ్బులు ప్రారంభించారు. భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య ఆదేశాల మేరకు పెదనాలబెల్లి గ్రామపంచాయతీ పరిధిలో లక్ష్మీపురం గ్రామంలో సుమారు 3 లక్షల రూపాయలతో పనులను , అనంతరం అచ్యుతాపురం గ్రామంలో సుమారు 4 లక్షల రూపాయలతో నిర్మించే నూతన సిసి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ఏజెన్సీలోని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రోడ్డు మార్గం ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పెదనాలపల్లి సర్పంచ్ మట్ట వెంకటేశ్వరరావు బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి కనితి రాముడు మాజీ మండల అధ్యక్షులు బైరెడ్డి సీతారామారావు సీనియర్ నాయకులు అప్పల్ రెడ్డి డివిజన్ యూత్ సెక్రటరీ లంక శివ జిల్లా సోషల్ మీడియా చైర్మన్ కనుబుద్ది దేవా శేఖర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు