మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:భారత కార్మిక సంఘాల సమైక్య ఇఫ్టు ముఖ్యకార్యకర్తల సమావేశం స్థానిక ఎల్లన్న విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి డి. ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇఫ్టు అనుబంధ మహాసభ ఏప్రిల్ రెండవ తారీఖున జరపాల్సి ఉండగా అట్టి సభను ఏప్రిల్ తొమ్మిదవ తేదీకి వాయిదా వేయటం జరిగిందన్నారు. కావున జిల్లాలో ఉన్న మున్సిపల్ కార్మికులు తొమ్మిదిన జరిగే జిల్లా ప్రధమ మహాసభకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, జిల్లా నాయకులు మల్లెల వెంకటేశ్వర్లు, పాయం వెంకన్న శాంతారావు, దుర్గారావు పాల్గొన్నారు.