మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఇంటిపట్టాల పంపిణీ పక్రియ ఈసారైనా పారదర్శకంగా జరగాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై, మాట్లాడారు.ఎన్నో ఏళ్ళుగా ఇల్లు కట్టుకొని జీవిస్తున్న వారికి యాజమాన్య హక్కు కల్పించడం కోసం ఎన్ని జీవోలు తీసుకువచ్చిన పేదవాడికి ఇంటిపట్టా అందని ద్రాక్ష లానే మిగిలిపోయిందని విమర్శించారు.జీవోల వల్ల అధికారులకు అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోందని.అదేవిధంగా ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేసి పట్టాలు చేపించుకోవడానికి తప్ప సామాన్యులకు ఒరిగింది ఏమి లేదన్నారు.గతంలో పట్టాల పంపిణీలో పెద్దయెత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయని స్థానిక ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇచ్చిన వారికే పట్టాలు వచ్చాయని ఆరోపించారు.గతంలో జరిగిన తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా జిల్లా అధికారులు గట్టి చర్యలు తీసుకుని పట్టాలు పంపిణీ చేయాలని సూచించారు.
ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు,నాగుల రవికుమార్,ఆట శ్రీకాంత్,సిద్దంకి మల్లేష్,హరికృష్ణ* తదితరులు పాల్గొన్నారు