మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
మండలంలోని పెదనాలబెల్లి గ్రామ చివర్లో ఉన్నటువంటి ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో గురువారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఆలయ తలుపులు పగలగొట్టి హుండీని ఆలయ వెనుక తీసుకెళ్లి తెరిచే ప్రయత్నం చేశారు దొంగలు ఉండి ఎంత ప్రయత్నించినా తెరవకపోవడంతో వదిలేసి వెళ్ళిపోయారు ఉదయాన్నే ఆలయానికి వచ్చిన అర్చకులు గమనించి కమిటీ సభ్యులకు తెలిపారు కమిటీ సభ్యుడు రామ్ లాల్ రాజ్ పరిశీలించి దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు.