UPDATES  

 ధ్వజస్తంభం ను ముక్కలు చేసిన ఫారెస్ట్ అధికారులు, ఆగ్రహంతో ఫారెస్ట్ ఆఫీసుని ముట్టడించిన గ్రామస్తులు..

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి 31: మండల పరిధిలోని గుమ్మడపల్లి గ్రామంలో ఫారెస్ట్ అధికారులు ధ్వజస్తంభంను దౌర్జన్యంగా ధ్వంసం చేశారని ఆరోపిస్తూ శుక్రవారం అశ్వరావుపేటలోని అటవీ కార్యాలయంపై దాడి నిర్వహించి ధర్నా చేశారు. గంగానమ్మ గుడి ధ్వజస్తంభ ఏర్పాటు చేసుకుంటూ గ్రామంలోని హిందూ భక్తులందరూ రాజకీయ నాయకులకు అధికారులకు సమాచారం ఇచ్చి వారిని కలిసి అడవిలో నుంచి ధ్వజస్తంభం కర్రను 20 రోజుల క్రితం నరికి తీసుకొచ్చుకోగా బుధవారం రాత్రి ఫారెస్ట్ అధికారులు దానిని ముక్కలు ముక్కలుగా నరికి తీసుకెళ్లిపోయారని దానికి నిరసనగా ఫారెస్ట్ కార్యాలయం ముట్టడించడం జరిగిందని, ఈ చర్యలకు పాల్పడిన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న అశ్వరావుపేట ఎస్సై రాజేష్ కుమార్ సిబ్బందితో వచ్చి నిరసనకారులను అదుపు చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !