మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రంలోని గ్రంధాలయాన్ని ములుగు గ్రంధాలయ చైర్మన్ గోవింద్ నాయక్ శుక్రవారం సందర్శించారు. గ్రంధాలయ గది శిదిలా వ్యవస్థలో ఉండటంతో, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కొత్త గ్రంధాలయం నిర్మించుటకు రూ.15 లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. నిరుపేద విద్యార్థులకు చదువులా తల్లిగా గ్రంధాలయం అందుబాటులో ఉండేందుకు కొత్త భవనం నిర్మాణం పూర్తి అయేంతవరకు తాత్కాలికంగా గ్రంధాలయ భవనంలోకి తరలిస్తామని అన్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను సిద్ధంగా ఉన్నాయని విద్యార్థులు గ్రంధాలయం అందుబాటులో ఉంట్టుందని పేర్కొన్నారు. గ్రూప్ 1 విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో పుస్తకాల పంపిణీ చేస్తార ని తెలిపినట్టు గ్రంథలయం చైర్మన్ గోవింద నాయక్ చెప్పారు. అనంతరం
కంటి వెలుగు కార్యక్రమని సందర్శించి రికార్డ్స్ పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. మారుమూల ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతంలో గ్రంధాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని వెంకటాపురం మండల జడ్పిటిసి పాయం రమణ అన్నారు. విద్యార్థులు పొటీ పరీక్షలకు ఎంతో కష్టపడి వారి ప్రతిభను చూపడం కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్నారని ఇప్పుడు వెంకటాపురం మండలంలో గ్రంధాలయం ఏర్పాటు అవడంతో దూరప్రాంతాలకు వెల్లే నిరుపేద విద్యార్థులకు అవకాశం కల్గడం ప్రత్యేక శ్రద్ధ చూపి విద్యార్థులు చదువుకునేల ఏర్పాటు అయినందుకు చాలా సంతోషకర మైన పరిణామం అని తెలియజేశారు. అంతేకాకుండా
అవసరమైన సామాగ్రి, ఫర్నిచర్, కలెక్టర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సదవువకాశం విద్యార్థులు ఉపయోగించుకోవాలని జడ్పీటీసీ పాయం రమణ అన్నారు. ఈ కార్యక్రమం లో గ్రంధాలయం ములుగు చైర్మన్ గోవిందా నాయక్, జడ్పీటీసీ పాయం రమణ, మండల అధ్యక్షులు గంప రాంబాబు, సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ,బి ఆర్ ఎస్ నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు.