మన్యం న్యూస్, భద్రాచలం :
భద్రాచలం న్యాయవాదుల సంఘానికి జరిగిన ఎన్నికల్లో 6 ఓట్ల మెజార్టీతో కోట దేవదానం విజయం సాధించినట్టు భద్రాచలం అడ్వకేట్స్ అసోషియేషన్ ఎన్నికల అధికారి కె విద్యా సాగర్, అంబేద్కర్ లు తెలిపారు. శుక్రవారం భద్రాచలం కోర్ట్ ప్రాంగణంలో 2023-24 సంవత్సరానికి అడ్వకేట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గము ఎన్నికలు జరిగాయి. న్యాయవాదుల ఎన్నికలలో ప్రెసిడెంట్ గా కోట దేవదానం, వైస్ ప్రెసిడెంట్ గా పులుసు తరుణి, జనరల్ సెక్రటరీ గా కె నవీన్, జాయింట్ సెక్రటరీ గా నర్మద, కోశాధికారిగా సాధన పల్లి సతీష్, స్పోర్ట్స్ అండ్ కల్చరర్ గా తిరుమలరావు, లైబ్రరీ కార్యదర్శి గా రెహమతా ఎన్నికయినట్లు తెలిపారు. అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికలో కోట దేవదానం కు 37, చైతన్య కు 31, జయరాజ్ కు 18 మధ్య ఓట్లు పడగా దేవదానం ప్రెసిడెంట్ 6 ఓట్ల మెజారిటీతో అధ్యక్ష పదవికి ఎన్నికయినారన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దేవదానంకు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు న్యాయవాది కృష్ణమాచారీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.