మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఏప్రిల్ 1: మండల పరిధిలోని పెంట్లం గ్రామంలో ఈనెల 6 వ తేదీన నిర్వహించే బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభా ప్రాంగణాన్ని శనివారం మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్ రావు పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సభకు విచ్చేయుచున్న బిఆర్ఎస్ నాయకులకు,కార్యకర్తలు,అభిమానులకు ఎటువంటి ఆటంకాలు,ఇబ్బందులు గురికాకుండా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సవలం రాణి,భూపతి నరసింహారావు,మామిల్లపల్లి లక్ష్మణరావు,భారత రాంబాబు,జంగల ఉమామహేశ్వరరావు,చల్లా రాంబాబు,బన్నే వెంకటేశ్వర్లు,భత్తుల వెంకన్న,గౌర వెంకటకృష్ణ,నల్లబెల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.