UPDATES  

 వెనకబడ్డ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేస్తున్నాను -ఎమ్మెల్యే మెచ్చా

  • వెనకబడ్డ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేస్తున్నాను -ఎమ్మెల్యే మెచ్చా
    మారుమూల ప్రాంతాల్లో సైతం జరుగుతున్న అభివృద్ది
    వచ్చే విద్యా సంవత్సరం నుంచి అశ్వారావుపేట లో డిగ్రీ
    24గం.అందుబాటులో వైద్య సేవలు

మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 01: అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎలక్ట్రానిక్ మీడియా , ప్రింట్ మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యే మెచ్చా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అశ్వారావుపేటలో కొన్ని కోట్ల రూపాయల అభివృద్ది జరిగిందనీ, ఒకొక్కటి సమకురుస్తూ అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడుపుతున్నానని, బిఆర్ఎస్ ప్రభుత్వంలో మారుమూల ప్రాంతాల్లో సైతం అభివృద్ది జరుగుతుందని, చీకట్లో బ్రతుకుతున్న వారికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసి వారికి వెలుగులు నింపడం జరిగిందనీ, కోట్ల రూపాయలతో వదల అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టడం జరిగిందని, వైద్యం కోసం పక్క చూపులు చూసే పరిస్థితి ఈరోజు లేదని, అశ్వారావుపేట లోనే 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, మీరు ఎం చేశారు అని ప్రశ్నించే వారు ఒక సారి వారు ఎం చేశారో గుర్తుచేసుకోవాలని, కోట్ల రూపాయలతో అభివృద్ది జరుగుతుంటే చూసి ఓర్చుకోలేక పోతున్నారని అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి ఆయన ద్వారా మంజూరైన నిధులు వివరాలను మీడియా వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లో శ్రీరామ్ మూర్తి, దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకన్న బాబు, మోహన్ రెడ్డి, సంపూర్ణ, రవి, నరసింహ రావు, ఉస్ ప్రకాష్, కాసాని చంద్ర మోహన్, బిర్రం వెంకటేశ్వరరావు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !