మన్యం న్యూస్, పినపాక:
మండల పరిధిలోని ఉప్పాక గ్రామానికి చెందిన
సిహెచ్ మమత- రూ.9,000,నాగజ్యోతి- రూ.28,000లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, సర్పంచ్ పూనెం సుజాత, ఉప సర్పంచ్ రామారావు, సొసైటీ డైరెక్టర్ కొండేరు రాము, సీతంపేటఉప సర్పంచ్ నాగభూషణం, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లికార్జున్, బాబు, సిలివేరు నారాయణ, శ్రీహరి, నాగేశ్వరరావు, శ్యామల సతీష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.