మన్యం న్యూస్, పినపాక:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు పినపాక మండలం ఉప్పాక పంచాయతీలో గల పొలాలకి, స్మశాన వాటికకు వెళ్లేదారిలో గల కల్వర్టు వర్షాల కారణంగా కూలిపోవడం జరిగింది. విషయాన్ని గ్రామ ప్రజలు నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావుకి తెలియజేశారు. ఈ కారణంగానే అధికారులు సమస్యను అంచనా వేయడం కోసం వచ్చారు. నీటిపారుదల శాఖ అధికారులతో రైతులు సమస్యను దగ్గరుండి తెలియజేయడం జరిగింది. త్వరలో ఈ సమస్యకి పరిష్కారం చేయాలని రేగా కాంతరావు దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఉప సర్పంచ్ గుంటుపల్లి రామారావు, పినపాక మండల సోషల్ మీడియా అధ్యక్షులు శ్యామల సతీష్ , నాయకులు కళ్యాణం మల్లికార్జున్ , ఏలబోయిన జనార్ధన్ ,మోటపోతుల నాగేశ్వరరావు , రైతులు పాల్గొన్నారు.