మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 01:యువ సేవాసమితి ఆధ్వర్యంలో గుమ్మడివళ్లి పూర్వ విద్యార్థులు పరీక్ష ఫ్యాడ్లను పెన్నులను శనివారం మండల పరిదిలోని నారాయణపురం మామిళ్ల వారి గూడెం పాఠశాలలో విద్యార్థులకు పంచారు. ముఖ్యఅతిథిగా గుమ్మడవల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిబాబు మాట్లాడుతూ ఇంతటి చక్కటి కార్యక్రమం చేస్తున్నారు పూర్వ విద్యార్థులు యువసేన సమితి సభ్యులు అందరికీ ఆదర్శం అని అన్నారు. అనంతరం యువ సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలు గురించి తాళ్లూరి నాగ మురళి మరియు గోసుల వంశీ విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువ సేవా సమితి ప్రధాన కార్యదర్శి డేరంగుల రామకృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తాళ్లూరి నాగ మురళి, సభ్యులు గోసుల వంశీ, త్రిమూర్తిలు, కోలేటి రాజు, పగడాల ప్రసాద్, షేక్ ఖలీద్, ఒంటి పులి నాగరాజు, సాధనం నవీన్, ఆలకుంట్ల వీరాజు తదితరులు పాల్గొన్నారు.