మన్యం న్యూస్: జూలూరుపాడు, ఏప్రిల్ 01, ఈనెల 3 నుంచి 13వ తారీకు వరకు నిర్వహించబోయే పదవ తరగతి పరీక్షల ఏర్పాట్లు పూర్తి అయినట్లు మండల విద్యాశాఖ అధికారి జి వెంకట్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల వ్యాప్తంగా 358 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, అందుకు మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, సెంట్ ఆంటోనీ హై స్కూల్ ల్లో సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా పరిషత్ పాఠశాలలో 190 మంది విద్యార్థులు, సెంట్ ఆంటోనీ హైస్కూల్లో 168 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులంతా పరీక్ష కేంద్రాలకు సకాలంలో హాజరుకావాలని కోరారు. లేటుగా వచ్చిన విద్యార్థులను అనుమతించమని తెలిపారు. పరీక్షల నిర్వహణ చీప్ సూపరిండెంట్లుగా సంజీవరావు, ధారావత్ నరసింహారావులు, డివోస్ గా రామ్ కుమార్, శంకర్ మహదేవ లు కస్టోడియన్ బాబూలాల్ లు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు