- అడవిలో అలజడి…..
- మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ లు ఏజెన్సీలో సంచరిస్తున్న సమాచారంతో అప్రమత్తమైన పోలీస్ బృందాలు
- సమాచారం మాకు బహుమతులు మీకు అని ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకు వెళ్తున్న పోలీస్ బృందాలు
మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
వెంకటాపురం మండలం సురవీడు ఆలబాక గ్రామాలలో మావోయిస్టు యాక్షన్ టీం లు తిరుగుతున్నట్లు నమ్మదగిన సమాచారంతో వెంకటాపురం మండలం సిఐ శివప్రసాద్ ఆల్బాక సిఆర్పిఎఫ్ బృందాలతో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. మావోలకు సంబంధించిన పోస్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఏజెన్సీ ప్రాంతంలోనే ప్రతి ఒక్కరికి చూపిస్తూ వారి జాడలను ఆరా తీస్తున్న వైనం పల్లెలో కనబడుతుంది. ఈ భయాందోళన కారణం చేత
టార్గెట్ చేసిన వారిని ముందుగానే అలర్ట్ చేసినట్లు సిఐ శివప్రసాద్ తెలియజేశారు,
అదేవిధంగా బోర్డర్ ప్రాంతాలైనటువంటి చతిస్గడ్ వెంకటాపురం, వాజేడు కొత్తపెళ్లి ఆలు బాకా ఈ ప్రాంతాలను అన్నిటిని సిఆర్పిఎఫ్ బృందాలతో డ్రోన్ కెమెరాల సహాయంతో ఏరియల్ సర్వే నిర్వహించినట్టు వారు తెలిపారు.
ఏజెన్సీలో ఏర్పడే భయాందోళనలొ ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా సీఐ, శివప్రసాద్ కోరారు. ఫోటోలు చూపించిన వ్యక్తుల గురించి సమాచారం ఇస్తే వారికి బహుమతులు ఇస్తామని. సమాచారం మాకు బహుమతులు మీకు అని నినాదంతో ప్రజలతో మమేకమయ్యారు. వారితోపాటు కొంత సమయం వరకు మాట్లాడి జరిగే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఎవరైనా అనుమానాస్పదంగా పల్లెలో సంచరించిన వారిని గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా వారు తెలిపారు.