తన జీవితమంతా పోరాటాలతోనే గడుస్తోందని, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రైతుల కోసం ఉద్యమాలు చేస్తూనే ఉన్నానని తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు దాదాపుగా తగ్గిపోయాయని, దేశమంతా ఇదే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్సమక్షంలో మహారాష్ట్రకు చెందిన రైతు సంఘాల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రైతు సంఘాల నేతలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.