మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఏప్రిల్ 2 : మండల పరిధిలోని అబ్బుగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న పెద్దమ్మ తల్లి జాతర గత వారం రోజు నుంచి భక్తుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.ఈ మేరకు ఆదివారం చివర రోజున కావడంతో నిప్పుల గుండం ను గిరిజన ఆదివాసి,గిరిజనేతర భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పెద్దమ్మతల్లి,పోతురాజులు,బొనాలకుండలు ఎత్తుకొని భక్తి శ్రద్ధలతో అగ్ని గుండం తొక్కారు.అనంతరం భక్తులు తమ మొక్కుబడులను మేకలు,కోళ్ళతో సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
