- సర్వ మతాల సమకాలికుడు రేగా
అన్ని మతాలను గౌరవించడం మానవ ధర్మం
ప్రభుత్వ విప్ రేగా
మన్యం న్యూస్ గుండాల.. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సర్వ మతాల సమకాలికుడు అనడానికి ఏదో గొప్ప నిదర్శనం. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదివారం తన బృందంతో కలిసి వరంగల్ వెళుతున్న సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు అన్వర్ కు నమాజ్ చేసుకునే సమయం రావడంతో మార్గమధ్యలో ఎమ్మెల్యే రేగా ప్రయాణిస్తున్న కారులో ఉన్న అన్వర్ కోసం వాహనాన్ని ఓ పక్కకు నిలిపి అన్వర్ నమాజ్ చేసుకునేందుకు వీలు కల్పించారు .పక్కనే ఉండి ఆసక్తిగా ఎమ్మెల్యే రేగా కూడా భక్తి భావంతో నమాజులో పాల్గొన్నారు ఈ అద్భుతమైన సంఘటన దారి గుండా వెళ్లే వారు ఆసక్తిగా తిలకించారు. అనంతరం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ సర్వ మతాలను గౌరవించడం మానవ ధర్మమని అన్నారు. తనకు అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజలు సమానమేనని ఆయన పేర్కొన్నారు