మన్యం న్యూస్ గుండాల.. మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం సర్వేను సక్రమంగా నిర్వహించాలని గుండాల ఎంపిపి ముక్తి సత్యం అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనా నిర్వహణకు వచ్చి అనేక ఆంక్షలు రైతులకు పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రామక్క, సర్పంచ్ సీతారాములు, ఉప సర్పంచ్ ఉపేందర్, నాయకులు అరేం నరేష్ , పరిషిక రవి, వెంకన్న, గడ్డం లాలయ్య, సారయ్య, బుచ్చయ్య, హజ్జర్, తదితరులు పాల్గొన్నారు
