UPDATES  

 బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తున్న మోడీకి తెలంగాణ లో అడుగుపెట్టే హక్కు లేదు. – మంద నరసింహ రావు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి.

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తూ, కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోడీ కి తెలంగాణ లో అడుగు పెట్టే హక్కు లేదని అన్నారు. హెడ్ ఆఫీస్ వద్ద ఎస్ సి ఈ యు – ఎస్ సి కె ఎస్ ఆధ్వర్యంలో మోడీ కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మంద నరసింహ రావు మాట్లాడుతూ అమ్మ లాంటి సింగరేణి నీ అమ్మాలని కంకణం కట్టుకున్న దుర్మార్గుడు మోడీ నీ గద్దె దించే విదంగా కార్మికులు, కర్శకులు ఐక్యంగా ఉద్యమించాలన్నర్. నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసి కార్మికుల పట్ల తన వైఖరి నీ నిజాయిథిని నిరూపించుకోవాలని అన్నారు. బొగ్గు బ్లకులను, సోలార్ విద్యుత్ ను అతి తక్కువ కు ఆదాని కి అమ్మడం వల్ల సింగరేణి సిరులుగల తల్లిని తాకట్టు పెట్టడానికే అన్నారు. వాస్తవాలు పక్కకు పెట్టీ, అబద్దాలతో వ్యవస్థను , ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తున్న నిరంకుశ పాలన కు వ్యతిరేకంగా ఉవ్వెత్తున అగ్నిజ్వలలు ఎగిసి పడుతున్న తీరుని దెస ప్రజలు ఏప్రిల్ ఐదు న ఢిల్లీలో చూసారని పెర్జొన్నారు. మోడీకి , బీజేపీ కి గోరి కట్టడానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్సులు, వీరన్న, ఐలయ్య, నాయకులు భూక్య రమేష్, రాజారావు, శ్యామ్, శేఖర్, శివ, కిషన్, భాస్కర్, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !