UPDATES  

 విజృంభిస్తున్న లంపిస్కిన్ వ్యాధి.

 

మన్యంన్యూస్, ఇల్లందురూరల్: ఇల్లందు మండల పరిధిలో, పశువుల్లో కలిగే లంపిస్కిన్ డిసీస్ (ఎల్ఎస్ డి) చాప కింద నీరులా ప్రవేశించి విజృంభిస్తోంది. సుదిమల్ల, ఇందిరా నగర్ పంచాయతీల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. లాంపిస్కిన్ వ్యాధి బారినపడిన పశువులు శరీరంపైన, అంతర్గత శరీర బాగలపైన విపరీతమైన గడ్డలు ఏర్పడుతున్నయి.నోటిలో అధికంగా లాలాజలం ఉరి సొల్లు కారుతుంది. ముక్కు కళ్ళ నుంచి కూడా స్రావాలు బయటకు వస్తున్నాయి. పశువులు ఆహారం తీసుకోవటం లేదు. పాడి పశువులలో పాల దిగుబడి పూర్తిగా పడిపోతుంది.పెద్ద పశువులతో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ దూడలలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఎల్ఎస్ డి వ్యాధికి సరైన చికిత్స లేకపోవటం తో ఆవులు, గేదెలు, లేగ దూడలు అధికంగా మృత్యువాత పడుతున్నాయి.అంటువ్యాధి కావడంతో మిగతావాటికీ సోకి మరణాల రేటు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నివారణా చర్యలు తీసుకుంటాం: ఏడి. విజయ
ఎల్ఎస్ డి విషయమై శాఖా అధికారి విజయ దృష్టికి తీసుకెళ్లగా వారు మన్యం న్యూస్ విలేకరితో మాట్లాడుతూ. రెండు నెలల క్రితం ఎల్ఎఫ్ డీ కి వాక్సినేషన్ పూర్తి చేసామన్నారు. గొటో ఫాక్స్, షీఫ్ ఫాక్స్ కుటుంబానికి చెందిన కాఫ్రి ఫాక్స్ అని పిలవబడే వైరస్ వలన లంపి స్కిన్ డిసీస్ కలుగుతుందని, దోమలు, ఈగలు, నల్లుల వలన వ్యాధి వ్యాప్తి చెందుతుందని తెలియ జేశారు.వ్యాధి సోకిన పశువులను వేరు చేసి వాటికి ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందించడం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచవచ్చుని తెలిపారు.లంపి స్కిన్ డిసీస్ నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !