మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్ 08: అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామ కాలనీలో మారుతి లక్ష్మణ్ రావు ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని శనివారం అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మొగలపు చెన్నకేశవరావు, సుంకవల్లి వీరభద్రరావు, అంకిత మల్లికార్జున్ రావు, మహేశ్వరరావు, పొట్ట రాజులు, బుసి పాండు, ముస్తఫా డాక్టర్, మైలవరం మళ్లీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.