మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు దారుణంగా హత్య కావించబడ్డ సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. కొత్తగూడెం పట్టణానికి చెందిన రావి మన్మధరావు 35 గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇటీవల మన్మధరావు గంజాయి కేసులో అరెస్టయి ఇటీవల విడుదలయ్యారు. రైల్వే స్టేషన్ లోని మూడో ప్లాట్ఫామ్ వద్ద మృతదేహం ఉంది .రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ అబ్బయ్య సంఘటన స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీం రంగప్రవేశం చేసి వేలిముద్ర ద్వారా మృతున్ని గుర్తించారు. రైల్వే స్టేషన్ పొడుగాటి ఐరన్ ప్లేట్ తో నిందితుడు మన్మధరావు మొఖం పై బలంగా కొట్టి హత్య చేయడంతో అతన్ని గుర్తించలేకపోయారు .వేలిముద్ర ద్వారానే క్లూస్ టీం మృతున్ని గుర్తించింది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా గంజాయి గొడవ కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఇందులో ముగ్గురు నిందితులు ఉన్నట్టు అనుమానం వ్యక్తం అవుతుంది పట్టపగలా యువకుడు రైల్వేస్టేషన్లో హత్య కావించబడటంతో సంచలనం రేపింది.